షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 27 నవం 2026, 9:42 సా.
తెలంగాణ

చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగాసీట్ల పెంపు

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 27 నవం 2026, 9:42 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగాసీట్ల పెంపు

న్యూఢిల్లీ: కేంద్రం చేపడుతున్న డీలిమిటేషన్‌లో ఈసారే గరిష్ఠ సంఖ్యలో పార్లమెంట్‌/అసెంబ్లీ స్థానాలు పెరుగనున్నాయి. సీట్ల పునర్విభజన కోసం సుప్రీంకోర్టు ప్రస్తుత/మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటు కానుంది. దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం ఇప్పటివరకూ నాలుగు డీలిమిటేషన్‌ కమిషన్లు పనిచేశాయి. ఇప్పుడు ఐదోది ఏర్పాటు కానుంది. 1952 డీలిమిటేషన్‌లో లోక్‌సభ సీట్ల సంఖ్య 494కు చేరింది. అయితే తర్వాత చేపట్టిన పునర్విభజనలో లోక్‌సభ స్థానాల సంఖ్య పదుల సంఖ్యలో మాత్రమే పెరిగాయి.

1961 జనాభా లెక్కల ప్రకారం 1963లో చేపట్టిన డీలిమిటేషన్‌లో సీట్ల సంఖ్య 494 నుంచి 522కు, 1971 జనగణన ప్రకారం 1973లో చేపట్టిన దానిలో 522 నుంచి 543కు సీట్లు పెరిగాయి. 1971/2001 జనాభా లెక్కల ప్రకారం 2002లో చేపట్టిన గణనలో ఎలాంటి పెరుగుదల నమోదు కాలేదు. అయితే 2011 జనాభా లెక్కల ఆధారంగా 2026లో (ప్రస్తుత ఏడాది) చేపట్టబోయే పునర్విభజనలో అనూహ్యంగా 50 శాతం సీట్ల సంఖ్య పెరిగి లోక్‌సభ సీట్ల సంఖ్య 850కు చేరవచ్చు.

Ss

#తెలంగాణ
న్యూఢిల్లీ: కేంద్రం చేపడుతున్న డీలిమిటేషన్‌లో ఈసారే గరిష్ఠ సంఖ్యలో పార్లమెంట్‌/అసెంబ్లీ స్థానాలు పెరుగనున్నాయి. సీట్ల పునర్విభజన కోసం సుప్రీంకోర్టు ప్రస్తుత/మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటు కానుంది. దేశంలో…