టీం ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఆడాలంటేనే ప్రత్యర్థులు చాలావరకు భయపడతారు. బాణాల్లాంటి బంతులతో వికెట్లు పడగొట్టడంతో బుమ్రా దిట్టా. అయితే న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో బుమ్రా బౌలింగ్ శైలిలో కనిపించిన మార్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఇన్నింగ్స్‌లో బుమ్రా కొత్త తరహా రన్ఆప్‌తో (పరిగెత్తడం) బౌలింగ్ చేశాడు. సాధారణంగా రన్‌ఆప్ సమయంలోనూ రెండు చేతులతో బంతిని పట్టుకునే బుమ్రా.. ఈసారి ఒక చేత్తోనే బంతిని పట్టుకుని బౌలింగ్ వేశాడు. మరి దీని వెనుక కారణం ప్రత్యర్థులను తికమక పెట్టడానికేనా అని చర్చ జరుగుతోంది. దీనిపై సహచర ఆటగాడు ఆకాశ్‌దీప్ స్పందించాడు.
తొలి రోజు మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఆకాశ్ దీప్ మాట్లాడుతూ.. ‘‘బుమ్రా ప్రాక్టీస్ సమయంలోనూ ఇదే తరహా బౌలింగ్ చేశాడు. అతడి మనసులో ఏదో ప్రణాళిక ఉండే ఉంటుంది. అందుకే ఇలా కొత్త శైలిలో బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా ఏం చేసినా ప్లాన్ ప్రకారమే ఆలోచించి చేస్తాడు’’ అని ఆకాశ్‌దీప్ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 85 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. ఆకాశ్‌దీప్ 2 వికెట్లు పడగొట్టగా.. బుమ్రాకు మాత్రం వికెట్ దక్కలేదు.