మన తెలంగాణ క్రైమ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. అయితే కారులో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కారు నుంచి బయటకు దిగడంతో సురక్షితంగా బయటపడ్డారు. చూస్తుండగానే మంటలు వాహనం మొత్తం వ్యాపించడంతో కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకున్నారు. కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.