షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 27 నవం 2026, 9:45 సా.
తెలంగాణ

ఆ 20 మందికి ఓటు హక్కు ఉంటుందా ?

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 27 నవం 2026, 9:45 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
ఆ 20 మందికి ఓటు హక్కు ఉంటుందా ?
  • తృణమూల్‌ కాంగ్రెస్‌ రెబల్స్‌పై స్పీకర్‌దే తుది నిర్ణయం

న్యూఢిల్లీ, , నవంబర్‌ 27: మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమయ్యే రాజ్యాంగ సవరణ బిల్లుతో ప్రభుత్వం వచ్చే వారం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్న సమయంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ముందు అనర్హత విచారణను ఎదుర్కొంటున్న 20 మంది తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎంపీల భవితవ్యం శాసనపరమైన లెక్కలపై ప్రభావం చూపవచ్చు.

ప్రభుత్వం ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ, మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదింపచేయడానికి మరో ప్రయత్నం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో సభలో వారి కొనసాగింపు, తద్వారా వారి ఓటు హక్కు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ 20 మంది ఎంపీలు జూన్‌లో టీఎంసీ నుంచి విడిపోయి అధికారంలో ఉన్న ఎన్‌డీయేకు మద్దతు ఇస్తున్న పెద్దగా ప్రాచుర్యంలో లేని నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌సీపీఐ)లో విలీనమవుతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత టీఎంపీ లోక్‌సభ నాయకుడు అభిషేక్‌ బెనర్జీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ స్పీకర్‌ను ఆశ్రయించారు.

దాదాపు 6 నెలల తర్వాత కూడా ఈ కేసు విచారణ అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఆ 20 మంది చట్టసభ సభ్యులు నవంబర్‌ 24న పార్టీని వీడాలనే తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వ్యక్తిగత సమాధానాలు సమర్పించారు. త్వరితగతిన పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ స్పీకర్‌ పిటిషన్లపై నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్‌ ఈ జాప్యాన్ని ప్రశ్నించారు. ఆమె ఒక కీలకమైన ప్రశ్నను కూడా లేవనెత్తారు.

వారి అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు ఈ ఎంపీలను డీలిమిటేషన్‌ బిల్లుపై ఓటు వేయడానికి అనుమతిస్తారా? ఒకవేళ వారిని అనర్హులుగా ప్రకటించిన పక్షంలో వారి ఓట్లు చెల్లుబాటు అవుతాయా? సుప్రీంకోర్టు నిర్దేశించిన రాజ్యాంగపరమైన నిబంధన ప్రకారం అనర్హత పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన ఒక ఎంపీ సభ్యత్వం లేదా ఓటు హక్కు రద్దు కాదు. ఓటింగ్‌ ప్రక్రియకు ముందే స్పీకర్‌ వారిని అనర్హులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయకపోతే ఆ 20 మంది ఎంపీలు పార్లమెంటరీ కార్యకలాపాల్లో పాల్గొనే హక్కును కలిగి ఉంటారు. ఒకవేళ ఆ తర్వాత వారిని అనర్హులుగా ప్రకటించినప్పటికీ ఆ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్న సమయంలో వారు వేసిన ఓట్లు దానంతటదే చెల్లనివిగా మారవు.

#తెలంగాణ
తృణమూల్‌ కాంగ్రెస్‌ రెబల్స్‌పై స్పీకర్‌దే తుది నిర్ణయం న్యూఢిల్లీ, , నవంబర్‌ 27: మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమయ్యే రాజ్యాంగ సవరణ బిల్లుతో ప్రభుత్వం వచ్చే వారం పార్లమెంట్‌…