మన తెలంగాణ/హైదరాబాద్: కూకట్‌పల్లి హౌసిం గ్ బోర్డు, హుడా ట్రక్ పార్క్, మియాపూర్ భూము ల వేలాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేపట్టా రు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు సీపీఐ, సీపీ ఎం, న్యూడెమోక్రసీ నాయకులు, స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ నెల 27న హెచ్‌ఎండీఏ నిర్వహించనున్న ఈ-వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మూసాపేట ట్రక్ పార్క్, కేపీహెచ్‌బీ,
మియాపూర్‌లోని ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు విక్రయించవద్దని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వామపక్ష నాయకులు కోరారు. ఈ భూములు ప్రజా ప్రయోజనాల కోసం సేకరించినవని, నగర అవసరాలకు ఉపయోగపడాల్సినవని వారు పేర్కొన్నారు. హుడా ట్రక్ పార్క్ భూములను ప్రభుత్వం ఎలా విక్రయిస్తోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. విక్రయాన్ని నిలిపివేసే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. ధర్నాలో బీఆర్‌ఎస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాధవరం రోడ్డుపై కిందపడిపోయారు. పోలీసులు మాధవరంతో పాటు మాజీ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పార్టీ కార్యకర్తలు, అఖిలపక్ష నాయకులను అరెస్టు చేశారు.
వేలం రద్దు చేయాల్సిందే: కేటీఆర్
అఖిలపక్ష నాయకుల అరెస్టు కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో ఆరోపించారు. అరెస్టు చేసిన మాధవరం కృష్ణారావు, శంభీపూర్ రాజుతో పాటు నాయకులందరినీ బేషరతుగా విడుదల చే యాలని డిమాండ్ చేశారు. ట్రక్ పార్క్ భూములు లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులు, చిరు వ్యాపారుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రజా ఆస్తి అని అ న్నారు. వేలంతో ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని విమర్శించారు.
నేతలను విడుదల చేయాలి: హరీశ్‌రావు
అఖిలపక్ష నాయకుల అరెస్టులను బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఎక్స్‌లో ఖండించారు. మాధవరం కృష్ణారావు, శంభీపూర్ రాజుతో పాటు ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపై నిర్బంధాలు ప్రయోగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని అన్నారు.