షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 25 నవం 2026, 7:53 ఉద.
క్రైమ్ వార్తలు

Wife kills husband | రూ.18 లక్షల ముంపు పరిహారం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 7:53 ఉద. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
Wife kills husband | రూ.18 లక్షల ముంపు పరిహారం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Wife kills husband | మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూ.18 లక్షల ముంపు పరిహారం కోసం కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కు చెందిన పశువుల కాపరి గజ్జి మల్లికార్జున్ (23)కు మక్తల్‌కు చెందిన అంజమ్మ అనే యువతితో వివాహమైంది.

కాగా, రెండు నెలల క్రితం మల్లికార్జున్ శ్రీశైలం వెళ్లగా, అతడికి రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలానికి చెందిన శివ అనే వ్యక్తి బస్సులో పరిచయంకాగా.. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారడంతో శివ తరచూ మల్లికార్జున్ గ్రామానికి వస్తుండేవాడు. ఈ క్రమంలో శివతో అంజమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

అయితే, ఉదండాపూర్ జలాశయం ముంపు పరిహారం కింద మల్లికార్జున్ కుటుంబానికి రూ.18 లక్షలు మంజూరు కావడంతో, ఆ డబ్బు కోసం భర్తను హత్య చేయాలని ప్రియుడు శివతో కలిసి అంజమ్మ పథకం వేసింది. ఈ నెల 20న కూలిపని ఉందని నమ్మించి మల్లికార్జున్‌ను బయటకు పిలిపించింది. అనంతరం అతడిని హత్య చేశారు. అయితే రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నెమళ్లగుట్ట సమీపంలో కుళ్లిపోయిన మల్లికార్జున్ మృతదేహం లభ్యం కావడంతో, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

#క్రైమ్వార్తలు
Wife kills husband | మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూ.18 లక్షల ముంపు పరిహారం కోసం కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన…