షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 25 నవం 2026, 2:13 సా.
సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్ సర్కారు.. ఎందుకో తెలుసా?

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 2:13 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్ సర్కారు.. ఎందుకో తెలుసా?

మదురై జిల్లా తిరుప్పరకుండ్రంలో కార్తీక దీపం వివాదం నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే సర్కారు సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. దేశ అత్యుతున్న న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయలేక పోవడంతో క్షమాపణలు చెబుతూ బుధవారం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే,

తిరుప్పరకుండ్రంలోని కొండపై ఉన్న సిక్కందర్‌ దర్గా వద్ద పురాతన రాతి స్తంభంపై దీపాన్ని వెలిగించాలనే దానిపై వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అక్కడే దీపం వెలిగించాలని గత యేడాది మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం ఉత్తర్వులు ఇవ్వగా అవి అమలు కాలేదు. ఈ నేపథ్యంలో ఈ యేడాది రాతి స్తంభంపై కార్తికదీపం వెలిగించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వులనూ మంగళవారం అమలు చేయలేదు. ఆలయ యంత్రాంగం అనుమతించకపోవడం వల్లే రాతి స్తంభంపై దీపం వెలిగించలేకపోయామని బుధవారం తమిళనాడు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

కోర్టు ఉత్తర్వులు అమలు చేయడానికి తాను అన్నివిధాలుగా ప్రయత్నించానని మదురై కలెక్టర్ సుప్రీంకోర్టు వెల్లడించారు. కొండపై ఉన్న రాతిస్తంభం వద్ద దీపాన్ని వెలిగించడం వల్ల తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు దెబ్బతింటాయని ఆలయ ట్రస్టీలు అభ్యంతరం వ్యక్తంచేసినట్లు పేర్కొన్నారు. దాంతో తిరుప్పరంకుండ్రం కొండపై ఎప్పటిలానే ఉచ్చిప్పిళ్లైయార్‌ ఆలయ దీప మండపంపైనే మహాదీపం వెలిగిందని చెప్పారు. ఇదిలాలవుంటే, ఈ చర్యను కోర్టు ధిక్కరణగా పరిగణించాలంటూ పిటిషనర్లు చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 

#సుప్రీంకోర్టు
మదురై జిల్లా తిరుప్పరకుండ్రంలో కార్తీక దీపం వివాదం నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే సర్కారు సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. దేశ అత్యుతున్న న్యాయస్థానం ఇచ్చిన తీర్పును…