షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 25 నవం 2026, 10:04 సా.
విద్య

ఆర్‌ఎంపీ వైద్యం వికటించి విద్యార్థిని మృతి

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 10:04 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
ఆర్‌ఎంపీ వైద్యం వికటించి విద్యార్థిని మృతి

ఓ బాలికకు ఆర్‌ఎంపీ వైద్యుడు చికిత్స చేయగా, వైద్యం వికటించి మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా మట్టంపల్లి మండలంలో బుధవారం జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. 8 తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికకు జ్వరం రావడంతో ఆమె తల్లి పెదవిడు గ్రామంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఉన్న ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఆర్‌ఎంపీ వైద్యుడు బాలిక రక్తనమూనాలను సేకరించడంతోపాటు, ఇంజెక్షన్ ఇచ్చాడు. అయితే కొద్దిసేపటికే తీవ్ర నీరసానికి గురైన బాలిక, స్పృహ కోల్పోయింది. దీంతో వెంటనే ఆర్‌ఎంపీ వైద్యుడు తన కారులో విద్యార్థినిని హుజూర్‌నగర్ అభయ వైద్యశాలకు తరలించాడు.

అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నదని చెప్పడంతో కోదాడకు తరలిస్తుండగా చిలుకూరు సమీపంలో విద్యార్థిని మృతి చెందింది. ఆర్‌ఎంపీ వైద్యం కారణంగానే తమ కూతురు మృతి చెందిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆర్‌ఎంపీ వైద్యం పేరుతో చికిత్స కేంద్రాలు నిర్వహిస్తున్న వారిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. 

#విద్య #ఆరోగ్యం #రాజకీయాలు
ఓ బాలికకు ఆర్‌ఎంపీ వైద్యుడు చికిత్స చేయగా, వైద్యం వికటించి మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా మట్టంపల్లి మండలంలో బుధవారం జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. 8 తరగతి…