షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 25 నవం 2026, 2:34 సా.
యువత

ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి – తెల్లవారుజామున ఏం జరిగింది?

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 2:34 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి – తెల్లవారుజామున ఏం జరిగింది?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మైహర్‌లో 21 యేళ్ళ యువతి ఓయో హోటల్ గదిలో అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రియుడితో కలిసి పుట్టిన రోజు వేడుకను జరుపుకునేందుకు వచ్చిన ఆ యువతి తెల్లవారే సరికి విగతజీవిగా కనిపించింది. ప్రియుడు, అక్క, మరో స్నేహితురాలు కొందరు యువకులతో కలిసి శారదాదేవి ఆలయం సమీపంలోని హోటల్‌లో మూడు గదులను బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తెలియకుండా వారంతా హోటల్ గదులకు చేరుకున్నారు.

అయితే, తెల్లవారుజామున 4 గంటల సమయంలో యువతి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ప్రైవేట్ భాగాల నుంచి తీవ్ర రక్తస్రావం అవుతున్నట్టు ప్రియుడు చెప్పగా, ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. 

ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వెంట వచ్చినవారు ప్రయత్నించగా, ఆస్పత్రి సిబ్బంది అడ్డుకుని, పోలీసులకు సమాచారం చేరవేశారు. యువతి మృతిపై ఆస్పత్రి సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

#యువత
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మైహర్‌లో 21 యేళ్ళ యువతి ఓయో హోటల్ గదిలో అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రియుడితో కలిసి పుట్టిన రోజు వేడుకను జరుపుకునేందుకు వచ్చిన ఆ యువతి తెల్లవారే…