షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 25 నవం 2026, 7:36 ఉద.
క్రైమ్ వార్తలు

కేఫ్‌లో యువతిపై అత్యాచారం

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 7:36 ఉద. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
కేఫ్‌లో యువతిపై అత్యాచారం

ఢిల్లీలో మరో సామూహిక అత్యాచార ఆరోపణ.

మన తెలంగాణ – న్యూస్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో మరో సామూహిక అత్యాచార ఆరోపణ వెలుగులోకి వచ్చింది. ప్రీత్ విహార్ ప్రాంతంలోని ఓ కేఫ్‌లో 22 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. బాధిత యువతి కర్కర్‌డూమాలోని ఓ కేఫ్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఏడుగురితో కలిసి ప్రీత్ విహార్‌లోని కేఫ్‌కు వెళ్లింది. కేఫ్ మూసివేసినప్పటికీ, బృందంలోని ఒకరి వద్ద తాళం చెవి ఉండటంతో అక్కడే పార్టీ కొనసాగించినట్లు సమాచారం. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ ముగిసిన అనంతరం అందరూ కేఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యువతి పోలీసులను ఆశ్రయించింది. పార్టీలో ఇద్దరు యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. యువతి చేసిన ఆరోపణలపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల పాత్రపై అధికారిక దర్యాప్తులో మరిన్ని విషయాలు వెల్లడికావాల్సి ఉంది.

#క్రైమ్వార్తలు #యువత
ఢిల్లీలో మరో సామూహిక అత్యాచార ఆరోపణ.మన తెలంగాణ – న్యూస్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో మరో సామూహిక అత్యాచార ఆరోపణ వెలుగులోకి వచ్చింది. ప్రీత్ విహార్ ప్రాంతంలోని ఓ కేఫ్‌లో…