షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 25 నవం 2026, 8:34 ఉద.
ఆహారం

Food Poison | ఎస్సీ బాలిక‌ల హాస్ట‌ల్‌లో ఫుడ్ పాయిజ‌న్‌.. డోర్ తీయ‌ని సిబ్బంది..!

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 8:34 ఉద. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
Food Poison | ఎస్సీ బాలిక‌ల హాస్ట‌ల్‌లో ఫుడ్ పాయిజ‌న్‌.. డోర్ తీయ‌ని సిబ్బంది..!

Food Poison | కాంగ్రెస్ స‌ర్కార్ హ‌యాంలో ప్ర‌భుత్వ స్కూల్స్, హాస్ట‌ళ్ల నిర్వ‌హ‌ణ ఎలా ఉందో మ‌రోసారి తెలియ‌జేసే ఘ‌ట‌న ఇది.. ఇప్ప‌టికే నాణ్య‌మైన ఆహారం లేకపోవ‌డంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌లు గురుకులాల్లో ఫుడ్ పాయిజ‌న్ అయిన ఘ‌ట‌న‌లు చాలానే వెలుగులోకి వ‌చ్చాయి. తాజాగా మ‌రోసారి అలాంటి ఘ‌ట‌నే సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట ఎస్సీ బాలికల హాస్టల్‌లో భోజనం వికటించింది. ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కావ‌డంతో పలువురు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోన‌య్యారు. అయితే ఫుడ్ పాయిజ‌న్ జ‌రిగిన విషయం బయటకు రాకుండా సిబ్బంది హాస్టల్ డోర్ పెట్టుకొని మిగిలిన ఆహారాన్ని పారబోసి, వంట పాత్రలను శుభ్రం చేయ‌డం గ‌మ‌నార్హం. విష‌యం తెలుసుకున్న త‌హ‌సీల్దార్‌, ఎస్‌ఐ వచ్చి డోర్ కొట్టినా సిబ్బంది అరగంట వరకు తీయ‌క‌పోవ‌డం నిర్వాహ‌కుల నిర్ల‌క్ష్యం ఏ స్థాయిలో ఉందో క్లారిటీ ఇస్తోంది.

హాస్టల్‌లో త‌మ‌కు పురుగుల అన్నం పెడుతున్నారంటూ విద్యార్థినులు ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

#ఆహారం
Food Poison | కాంగ్రెస్ స‌ర్కార్ హ‌యాంలో ప్ర‌భుత్వ స్కూల్స్, హాస్ట‌ళ్ల నిర్వ‌హ‌ణ ఎలా ఉందో మ‌రోసారి తెలియ‌జేసే ఘ‌ట‌న ఇది.. ఇప్ప‌టికే నాణ్య‌మైన ఆహారం లేకపోవ‌డంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌లు…