షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 25 నవం 2026, 9:20 సా.
ఆంధ్రప్రదేశ్

Cm Chandrababu Naidu: ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రేషన్‌లో తక్కువధరకే కందిపప్పు, నూనె

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 9:20 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
Cm Chandrababu Naidu: ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రేషన్‌లో తక్కువధరకే కందిపప్పు, నూనె

Cm Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచి, సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పును రూ.100కే, లీటరు పామాయిల్‌ను రూ.125కే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. కందిపప్పు ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, కేంద్రం కేటాయించిన 40,300 మెట్రిక్ టన్నుల కందుల సరఫరాకు వేగంగా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. మరోవైపు ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రస్తుతం 286గా ఉన్న ధరణి బ్రాండ్ బియ్యం విక్రయ కేంద్రాలను 500కు పెంచాలని నిర్దేశించారు. ఇప్పటివరకు 2.25 లక్షల మందికి పైగా వినియోగదారులు ధరణి బియ్యం కొనుగోలు చేశారని, మొత్తం 59,662 క్వింటాళ్ల విక్రయాలు జరిగాయని అధికారులు వివరించారు.

తగ్గిన ధరల వివరాలు.. రైతులకు మద్దతు ధరపై దిశానిర్దేశం:

ధరణి బ్రాండ్ కింద మార్కెట్ కంటే తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందిస్తున్నట్లు అధికారులు సీఎంకు(Cm Chandrababu Naidu) తెలిపారు. రూ.76 మార్కెట్ ధర ఉన్న KNM/RNR రకం బియ్యాన్ని రూ.50కే, రూ.66 మార్కెట్ ధర ఉన్న BPT రకం బియ్యాన్ని రూ.49కే విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో బియ్యం ధరలు 8 నుంచి 18 శాతం వరకు తగ్గగా, ఉల్లి ధరలు 28 శాతం తగ్గాయని, పామాయిల్ ధర లీటరుకు రూ.145కు చేరిందని గణాంకాలు వెల్లడించాయి. కందిపప్పు ధరలను నియంత్రించడంతో పాటు కంది పండించే రైతులకు కనీస మద్దతు ధర అందేలా చూడాలని చంద్రబాబు సూచించారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించడం ద్వారా వారికి గిట్టుబాటు ధర లభించడంతో పాటు వినియోగదారులకు నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

తనిఖీలు, జరిమానాలు.. ఏడాదిన్నర పాటు నిరంతర నిఘా:

బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ తరలింపుపై నిరంతరం నిఘా ఉంచాలని సీఎం ఆదేశించారు. అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ, ఇప్పటివరకు నిర్వహించిన 1,558 తనిఖీలలో 1,005 కేసులు నమోదు చేసి రూ.84.59 లక్షల జరిమానాలు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. సరిహద్దు చెక్‌పోస్టులు, టోల్‌గేట్ల వద్ద నిఘాను పెంచాలని, రానున్న ఏడాదిన్నర పాటు నిత్యావసరాల మార్కెట్ ధరలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని చంద్రబాబు ఆదేశించారు.

#ఆంధ్రప్రదేశ్
Cm Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచి, సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను…