షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 25 నవం 2026, 9:02 ఉద.
టెక్నాలజీ

చైనీస్ ఏఐ టూల్తో US నిఘా సంస్థలపై సైబర్ ఎటాక్ !

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 9:02 ఉద. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
చైనీస్ ఏఐ టూల్తో US నిఘా సంస్థలపై సైబర్ ఎటాక్ !

Chinese AI Tool : అమెరికా భద్రతా వ్యవస్థలను ఉలిక్కిపడేలా చేస్తూ ఆ దేశానికి చెందిన మూడు అత్యంత కీలక నిఘా సంస్థలపై భారీ సైబర్ దాడి జరిగింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA), ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ODNI), మరియు నేషనల్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (NGA) వ్యవస్థలే లక్ష్యంగా హ్యాకర్లు ఈ దాడికి పాల్పడినట్లు అమెరికన్ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఈ సైబర్ దాడి ప్రభావం ఆయా సంస్థల నెట్‌వర్క్‌లపై పడినప్పటికీ, అత్యంత రహస్యమైన (సీక్రెట్) డేటాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, అది పూర్తిగా సురక్షితంగానే ఉందని ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.

చైనీస్ AI టూల్ వినియోగంపై గుర్తింపు.. బీజింగ్ ప్రమేయంపై ముమ్మర దర్యాప్తు

ఈ సైబర్ దాడి వెనుక ఉన్న సాంకేతికతను విశ్లేషించిన అమెరికా సైబర్ భద్రతా నిపుణులు కీలక విషయాలను గుర్తించారు. ఈ దాడిని నిర్వహించడానికి హ్యాకర్లు ఒక అత్యాధునిక చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్‌ను ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయి. ఏఐ సాయంతో భద్రతా వలయాలను ఛేదించేందుకు హ్యాకర్లు ప్రయత్నించడం అమెరికా రక్షణ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ దాడి వెనుక చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న హ్యాకింగ్ గ్రూపుల ప్రమేయం ఉందా అనే కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థలు లోతైన విచారణ చేపట్టాయి.

#టెక్నాలజీ
Chinese AI Tool : అమెరికా భద్రతా వ్యవస్థలను ఉలిక్కిపడేలా చేస్తూ ఆ దేశానికి చెందిన మూడు అత్యంత కీలక నిఘా సంస్థలపై భారీ సైబర్ దాడి జరిగింది. సెంట్రల్…