షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 24 నవం 2026, 4:57 సా.
తాజా వార్తలు

Weather Alert : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ 14 జిల్లాల్లో పిడుగులు, ఉరుములతో వర్షాలు!

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 24 నవం 2026, 4:57 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
Weather Alert : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ 14 జిల్లాల్లో పిడుగులు, ఉరుములతో వర్షాలు!
  • బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం..
  • ఏపీలో మారనున్న వాతావరణం..
  • ఈ 14 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం

Weather Alert : ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. ఇప్పటికే అక్కడక్కడ వర్షాలు కురుస్తుండగా.. రానున్న రోజుల్లో కూడా భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా 14 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.

నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉండటమే కాకుండా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు..

ఈ 14 జిల్లాల్లో వర్షాలు :
నవంబర్ 25, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురుగా జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు..

పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు :
మంగళవారం కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 39.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తపట్నంలో 34.4, కావలిలో 34.2, మారెళ్లలో 33.5, త్రిపురాంతకంలో 27.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నెల్లూరు, గుంటూరు ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదైంది.

ప్రజలకు హెచ్చరిక :
వర్షాలతో పాటు పిడుగులు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది.

#తాజావార్తలు
బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. ఏపీలో మారనున్న వాతావరణం.. ఈ 14 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం Weather Alert : ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. ఇప్పటికే అక్కడక్కడ వర్షాలు…