సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసిందని ప్రముఖ నాయకుడు అన్నామలై పేర్కొన్నారు. ఆయన కార్తీక దీపాన్ని సుప్రీంకోర్టు సూచించిన విధంగా, భక్తుల మనోభావాలకు తగ్గట్లుగా టీవీకె ప్రభుత్వం చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఆయన ఎక్స్ పేజీలో పేర్కొంటూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారంతో పరిపాలించే వ్యక్తి. న్యాయస్థానాలు ప్రజాస్వామ్యానికి గొప్ప స్తంభాలుగా నిలుస్తాయి. ప్రభుత్వం తన సొంత ఇష్టాయిష్టాలకు లొంగిపోకుండా, న్యాయస్థానాల తీర్పులను నిజాయితీగా అమలు చేసినప్పుడే న్యాయం నెగ్గుతుంది.
టివికె ప్రభుత్వం ఇప్పుడు తిరుపరంకుండ్రం దీపాతూన్ కేసులో న్యాయస్థానాల తీర్పులను ధిక్కరిస్తూ ఏకపక్షంగా వ్యవహరించింది. ఒక సామాన్య పౌరుడిగా, దీని పర్యవసానాలు ఎంత వినాశకరంగా ఉంటాయో నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఈ విషయం అర్థం కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ విజయ్ గారి చుట్టూ ఉన్నవాళ్లు ఆయనను తప్పుదోవ పట్టిస్తూ, ఆయన చుట్టూ ఒక భ్రమల గోడను నిర్మిస్తున్నట్లుగా నిజంగా అనిపిస్తోంది. ఆయన దానిని ఛేదించుకోకపోతే, నష్టపోయేది ఆయనే.
కారణం ఏదైనా కావచ్చు. రాజకీయాలు, అజ్ఞానం, లేదా సంకీర్ణ భాగస్వాముల ఒత్తిడి... రాజ్యాంగ చట్టానికి అనుగుణంగా పరిపాలిస్తామని ప్రతిజ్ఞ చేసిన టివికె ప్రభుత్వం, ఈ రోజు ఎప్పటికీ సరిదిద్దలేని ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని చేసింది అని పేర్కొన్నారు.