షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 24 నవం 2026, 6:17 సా.
తాజా వార్తలు

ప్రయాణికులకు అలెర్ట్ : వందే భారత్ రైలు ఎక్కే ముందు ఇవి తెలుసుకోండి…

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 24 నవం 2026, 6:17 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
ప్రయాణికులకు అలెర్ట్ : వందే భారత్ రైలు ఎక్కే ముందు ఇవి తెలుసుకోండి…

చాలా మంది ప్రయాణికులు కొత్తగా పరుగులు పెడుతున్న వందే భారత్ రైళ్లు ఎక్కి ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా లగేజీ సర్దడానికి, తమ ఆప్తులకు వీడ్కోలు చెప్పడానికి రైలు ఎక్కి బోగీల్లోనే ఇరుక్కోపోతున్న సంఘటనలో తరచూ జరుగుతున్నాయి. ఫలితంగా అపరాధంతో పాటు ఎంతో విలువైన సమయాన్ని, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అందువల్ల వందే భారత్ రైళ్లు ఎక్కే ముందు ప్రయాణికులు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలని రైల్వే శాఖ సూచన చేస్తోంది.

సాధారణ రైళ్ళతో పోలిస్తే వందే భారత్ రైళ్ళ వ్యవస్థ పూర్తి భిన్నంగా ఉంటుంది. రైళ్లలో భద్రత, వేగం దృష్ట్యా అధునాతన ఆటోమేటిక్ సెన్సార్ డోర్లను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే సమయానికి ముందుగానే డోర్లు వాటంతట అవే మూసుకునిపోతాయి. తిరిగి తర్వాత స్టేషన్ వచ్చేంత వరకు అవి తెరుచుకోవు. సాధారణం రైళ్ల మాదిరిగా వీటి తలుపులు మనుషులు బలవంతంగా తెరవడం సాధ్యం కాదు. దీనివల్ల ప్రయాణికులకు వీడ్కోలు పలకడానికి లేదా లగేజీ సర్దడానికి లోపలికి వెళ్లిన వారు తరచూ లోపలే చిక్కుకునిపోతున్నారు. 

ఇలాంటి ఘటన ఇటీవల కాన్పూర్ రైల్వే స్టేషన్‌ జరిగింది. తమ బంధువులను వీడ్కోలు పలికేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది పిల్లలు, పెద్దలు రైలు డోర్లు మూసుకుని పోవడంతో అందులో చిక్కుకునిపోయారు. వీరంతా తర్వాత స్టేషన్ అంటే 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటావా స్టేషన్ వచ్చేంత వరకు రైలులోనే ఉండిపోయారు. దాదావు 80 నిమిషాల పాటు ప్రయాణం చేశారు. వీరిని రైల్వే సిబ్బంది అనధికారిక ప్రయాణికులుగా గుర్తించి టిక్కెట్ చార్జీలతో పాటు మొత్తంగా రూ.36140 భారీ అపరాధం వసూలు చేశారు. ఇలాంటి తరహా ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ప్రయాణికులను హెచ్చరిస్తూ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 

చెల్లుబాటు అయ్యే టికెట్ : ప్రయాణానికి సంబంధించిన ధ్రువీకృత టికెట్ ఉన్నవారు మాత్రమే రైలు బోగీల్లోకి ప్రవేశించాలి.

ప్లాట్‌ఫారమ్ టికెట్ పరిమితులు : ఫ్లాట్‌ఫారమ్ టికెట్ కేవలం స్టేషన్ ప్రాంగణంలోకి రావడానికి మాత్రమే అనుమతినిస్తుంది తప్ప, రైలు బోగీల్లోకి ఎక్కడానికి లేదా లోపల ఉండటానికి ఎలాంటి అనుమతి ఉండదు. 

బోగీల వద్దకే వీడ్కోలు : బంధువులను, స్నేహితులను సాగనంపడానికి వచ్చిన వారు ప్లాట్‌ఫామ్‌పైనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రైలు లోపలికి అడుగుపెట్టకూడదు.

కూలీల సేవలు : వృద్ధులకు సహాయం చేసేందుకు లేదా ఎక్కువ లగేజీ ఉన్న సందర్భాల్లో అధీకృత రైల్వే కూలీల సేవలను వినియోగించుకోవాలి.

సమయపాలన : వందే భారత్ రైళ్లు స్టేషన్లలో చాలా తక్కువ సమయం మాత్రమే ఆగుతాయి. తలుపులు త్వరగా మూసుకుపోతాయి కాబట్టి ప్రయాణికులు ముందే స్టేషన్‌కు చేరుకోవడం మంచిది.

అత్యవసర చైన్ : సరైన, ప్రాణాంతక కారణం లేకుండా రైలు ఆపడానికి అత్యవసర అలారం చైన్ లాగితే భారీ జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవు. ప్రయాణికుల వేగవంతమైన ప్రయాణం, భద్రత కోసమే ఈ నిబంధనలు రూపొందించామని, అనవసర జరిమానాలు మరియు అసౌకర్యానికి గురికాకుండా ప్రజలు సహకరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. 

#తాజావార్తలు
చాలా మంది ప్రయాణికులు కొత్తగా పరుగులు పెడుతున్న వందే భారత్ రైళ్లు ఎక్కి ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా లగేజీ సర్దడానికి, తమ ఆప్తులకు వీడ్కోలు చెప్పడానికి రైలు ఎక్కి బోగీల్లోనే…