షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 24 నవం 2026, 7:04 ఉద.
బ్యాంక్ ఉద్యోగాలు

Bank Jobs | ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో 120 ఖాళీలు.. నవంబర్‌ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 24 నవం 2026, 7:04 ఉద. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
Bank Jobs | ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో 120 ఖాళీలు.. నవంబర్‌ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం

ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (EXIM Bank) 2026 రిక్రూట్‌మెంట్‌లో భాగంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 120 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి గల యంగ్‌ ప్రొఫెషనల్స్‌ నుంచి దరఖాస్తులు కోరుతుంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 27 నుంచి ప్రారంభమవుతుంది.

పోస్టుల వివరాలు
మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (MT)- 90
బ్యాంకింగ్‌ ఆపరేషన్స్‌ (Credit/Loans/Advances)- 50
ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌- 3
ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌- 1
ఇంటర్నల్‌ ఆడిట్‌- 5
కంప్లయన్స్‌- 2
ఎన్విరాన్‌మెంటల్‌, సోషల్‌ అండ్‌ గవర్నెన్స్‌ (ESG)- 1
రిస్క్‌ మేనేజ్‌మెంట్‌- 2
సైబర్‌ సెక్యూరిటీ- 2
లీగల్‌- 10
డిజిటల్‌ టెక్నాలజీ- 9
హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌- 2
అడ్మినిస్ట్రేషన్‌- 2
కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌- 1

మేనేజర్‌- 30
క్రెడిట్‌ అప్రైజల్‌- 4
లోన్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మానిటరింగ్‌- డాక్యుమెంటరీ క్రెడిట్‌- 3
లోన్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మానిటరింగ్‌- బ్యాంక్‌ గ్యారంటీస్‌- 3
లోన్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మానిటరింగ్‌- ట్రేడ్‌ ఫైనాన్స్‌- 4
స్పెషల్‌ సిచ్యుయేషన్స్‌ గ్రూప్‌/రికవరీ- 3
రిస్క్‌ మేనేజ్‌మెంట్‌- 2
కంప్లయన్స్‌- 2
ఇంటర్నల్‌ ఆడిట్‌- ట్రెజరీ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌- 2
ఇంటర్నల్‌ ఆడిట్‌- ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ‌- 1
మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (MSME)- 2
సస్టెయినబుల్‌ ఎంటర్‌ప్రైజ్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌- 2
కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌/కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ- 2

Exim Posts

అర్హతలు
పోస్టును బట్టి ఎంబీఏ, పీజీడీబీఏ, పీజీడీఎం, ఎంఎంఎస్‌, ఎంఏ (ఎకనామిక్స్‌), సీఏతో పాటు ICAIలో సభ్యత్వం, ఎల్‌ఎల్‌బీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు
అభ్యర్థుల వయసు మేనేజ్‌మెంట్‌ ట్రెయినీకి 21 నుంచి 28, మేనేజర్‌ (MM-II)కు 24 నుంచి 30 ఏండ్లలోపు ఉండాలి.
రిజర్వేషన్‌ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది.

ఎంపిక
ఆన్‌లైన్‌ రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో పార్ట్‌-1 ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌ (కంపల్సరీ క్వశ్చన్‌)- 40, పార్ట్‌-2 ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌- సబ్జెక్టివ్‌ (అటెంప్ట్‌ ఏవైనా 6 నుంచి 8 ప్రశ్నలు)- 60 మార్కులు కేటాయించారు.

ఫీజు
దరఖాస్తు ఫీజు రూ. 600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌, మహిళలకు రూ. 100.

వేతనం
ఎంపికైన మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలకు సంవత్సరం ట్రెయినింగ్‌ పీరియడ్‌లో నెలకు రూ. 65,000 స్టైపెండ్‌గా ఇస్తారు. మేనేజర్‌లకు రూ. 64,820-93,960 ఉంటుంది.

చివరితేదీ
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 27 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ 11తో ముగుస్తుంది. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ చూడండి.

#బ్యాంక్ఉద్యోగాలు #బిజినెస్ #ఉద్యోగాలు
ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (EXIM Bank) 2026 రిక్రూట్‌మెంట్‌లో భాగంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 120 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి గల…