షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 23 నవం 2026, 11:09 సా.
అంతర్జాతీయం

పార్కింగ్ చేస్తే కారు స్టీరింగ్ మాయం..చైనా మరో కొత్త ఆవిష్కరణ

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 23 నవం 2026, 11:09 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
పార్కింగ్ చేస్తే కారు స్టీరింగ్ మాయం..చైనా మరో కొత్త ఆవిష్కరణ

మన తెలంగాణ/హైదరాబాద్: టెక్నాలజీలో ఎప్పుడూ ముందంజలోనే ఉండే చైనా తాజాగా మరో అద్భుత ఆవిష్కరణ చేసింది. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న టీ9 అనే హైబ్రిడ్ కారు ప్రత్యేకత ఏమిటంటే.. కారును పార్క్ చేయగానే స్టీరింగ్ పూర్తిగా మాయమవుతుంది. స్టీరింగ్ డాష్‌బోర్డులోకి ముడుచుకుపోతుంది. దీంతో కారులోనే హాయిగా కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. ముందు సీట్లలో కాళ్లు చాచుకుని సేదతీరవచ్చు.

ఈ వినూత్న సాంకేతికతను స్టీర్ బై వైర్ విధానంతో రూపొందించారు. సాధారణ కార్లలో స్టీరింగ్‌కు చక్రాలకు మధ్య ఇనుప రాడ్డు అనుసంధానం ఉంటుంది. అయితే ఈ కొత్త కారులో ఆ యాంత్రిక అనుసంధానం లేదు. ఎలక్ట్రానిక్ సంకేతాలతోనే స్టీరింగ్ పనిచేస్తుంది. అందుకే పార్క్ చేసినప్పుడు స్టీరింగ్‌ను లోపలికి తీసుకోవడం సాధ్యమైంది. డ్రైవింగ్ చేసేటప్పుడు మళ్లీ స్టీరింగ్ బయటకు వచ్చేస్తుంది.

ఆరు సీట్లతో వచ్చిన ఈ కారు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విశాలమైన లోపలి భాగం, ఆధునిక సౌకర్యాలు, కొత్త తరహా డిజైన్‌తో ఈ కారు హాట్ టాపిక్‌గా మారింది. పార్కింగ్ తర్వాత కారును చిన్న గదిలా వాడుకోవచ్చని, ప్రయాణంలో అలసిపోయినప్పుడు అక్కడే విశ్రాంతి తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. భవిష్యత్తులో కార్ల డిజైన్ ఇలాగే మారుతుందా అన్న చర్చ సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది.

#అంతర్జాతీయం
మన తెలంగాణ/హైదరాబాద్: టెక్నాలజీలో ఎప్పుడూ ముందంజలోనే ఉండే చైనా తాజాగా మరో అద్భుత ఆవిష్కరణ చేసింది. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న టీ9 అనే హైబ్రిడ్ కారు ప్రత్యేకత ఏమిటంటే.. కారును…