షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 23 నవం 2026, 7:53 ఉద.
టెక్నాలజీ

బిస్లరీ వాటర్‌పై అనుమానాలు.. రంగంలోకి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ!

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 23 నవం 2026, 7:53 ఉద. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
బిస్లరీ వాటర్‌పై అనుమానాలు.. రంగంలోకి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ!

న్యూఢిల్లీ: ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లరీ నీటి నాణ్యతపై వివాదం నెలకొంది. గోవాలోని కంపెనీ ప్లాంట్ నుంచి సేకరించిన నీటి నమూనాల్లో భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ).. బిస్లరీపై ప్రాసిక్యూషన్‌కు అనుమతించింది.

2025 సెప్టెంబర్‌లో గోవాలోని బిస్లరీ ప్లాంట్ నుంచి అధికారులు ఆరు నీటి నమూనాలు సేకరించారు. వీటిలో ఐదు ప్రమాణాలకు అనుగుణంగా ఉండగా.. ఒక నమూనాలో బ్రోమేట్ స్థాయి లీటరుకు 12 మైక్రోగ్రాములుగా నమోదైంది. అనుమతించిన పరిమితి 10 మైక్రోగ్రాములు మాత్రమే దీనిపై బిస్లరీ అప్పీల్ చేయడంతో నమూనాను రిఫరల్ ల్యాబ్‌కు పంపారు. అక్కడ బ్రోమేట్ పరిమితిలోనే ఉన్నట్లు తేలినా.. పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (పీఏహెచ్‌లు) గుర్తించినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెల్లడించింది. దీంతో నీటిని అసురక్షితమైనదిగా ప్రకటించి, ప్రాసిక్యూషన్‌కు అనుమతించింది

తమ ఉత్పత్తులు వినియోగానికి సురక్షితమేనని బిస్లరీ స్పష్టం చేసింది. తయారీ ప్రక్రియలో 10 దశల్లో 90కి పైగా నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపింది. స్వతంత్ర ల్యాబ్ పరీక్షల్లో బ్రోమేట్ స్థాయి అనుమతించిన పరిమితిలోనే ఉన్నట్లు తేలిందని పేర్కొంది. ఈ నివేదికలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కి సమర్పించామని, అధికారులతో పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. ఒకే నీటి నమూనాపై పరీక్షల్లో భిన్నమైన ఫలితాలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్యలు, బిస్లరీ వివరణల నేపథ్యంలో ఈ వివాదంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

#టెక్నాలజీ
న్యూఢిల్లీ: ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లరీ నీటి నాణ్యతపై వివాదం నెలకొంది. గోవాలోని కంపెనీ ప్లాంట్ నుంచి సేకరించిన నీటి నమూనాల్లో భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు గుర్తించిన…