షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 23 నవం 2026, 6:02 ఉద.
జాతీయం

Agniveers Marriage Rules : అగ్నివీరులకు అదిరిపోయే శుభవార్త.. రెండేళ్ల సర్వీస్ పొడిగింపు.. పెళ్లి కూడా చేసుకోవచ్చు..!

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 23 నవం 2026, 6:02 ఉద. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
Agniveers Marriage Rules : అగ్నివీరులకు అదిరిపోయే శుభవార్త.. రెండేళ్ల సర్వీస్ పొడిగింపు.. పెళ్లి కూడా చేసుకోవచ్చు..!

Agniveers Marriage Rules : అగ్నివీరులకు భారత నౌకాదళం శుభవార్త చెప్పింది. అగ్నివీరులు తొలి నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అనంతరం పొందే రెండేళ్ల సర్వీసు పొడిగింపు వ్యవధిలో పెళ్లి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, పొడిగించిన ఆ రెండేళ్ల సర్వీసు సమయంలో పెళ్లి చేసుకుని గర్భం దాల్చిన మహిళా అగ్నివీరులకు పూర్తిస్థాయి ప్రసూతి ప్రయోజనాలు, సెలవులు అమలవుతాయని ప్రకటించింది.

అగ్నిపథ్ పథకం కింద 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకులను అగ్నివీరులుగా నియమిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. ప్రారంభ నాలుగేళ్ల సర్వీసు కాలంలో అగ్నివీరులు వివాహం చేసుకోవడానికి అనుమతి లేదు. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించి పెళ్లి చేసుకుంటే విధుల నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది. అయితే, తాజాగా రెండేళ్ల సర్వీసు పొడిగింపునకు సంబంధించి నేవీ ఈ నిబంధనలో వెసులుబాటు కల్పించింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని రెండేళ్ల పొడిగింపునకు అంగీకరించిన వారు వివాహం చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఈ వెసులుబాటుకు కొన్ని షరతులు విధించింది. రెండేళ్ల పొడిగింపునకు ఎంపికైన అగ్నివీరులు ముందుగా తప్పనిసరి ప్రారంభ శిక్షణను పూర్తి చేయాలి. ఈ శిక్షణలో వృత్తిపరమైన, వారు ఎంపికైన విభాగానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఉంటుంది. అది పూర్తయిన తర్వాత వివాహం కోసం తమకు అర్హత ఉన్న సెలవులను వినియోగించుకోవచ్చని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అగ్నివీరుల సర్వీసు కాలాన్ని నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తొలి నాలుగేళ్ల తర్వాత ప్రతిభ ఆధారంగా 25 శాతం మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించనున్నారు. మిగిలిన 75 శాతం మందికి మరో రెండేళ్ల సర్వీసు అవకాశం కల్పించారు. ఆ తర్వాత అర్హతలు, ఆసక్తి ఆధారంగా శాశ్వత సైనిక ఉద్యోగాల్లో చేరేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో వివాహానికి సంబంధించి నేవీ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నౌకాదళం తర్వాత భారత సైన్యం (Army), వైమానిక దళం (Air Force) కూడా తమ నిబంధనలకు అనుగుణంగా ఇలాంటి వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.

#జాతీయం
Agniveers Marriage Rules : అగ్నివీరులకు భారత నౌకాదళం శుభవార్త చెప్పింది. అగ్నివీరులు తొలి నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అనంతరం పొందే రెండేళ్ల సర్వీసు పొడిగింపు వ్యవధిలో పెళ్లి…