రంగారెడ్డి: జిల్లాలోని షాబాద్ మండలం హయతాబాద్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చందనవెల్లి పారిశ్రామికవాడలోని ట్రీ ఫాయిల్ కంపెనీలో ఒకసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో మంటలు ఎగసిపడటంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.