షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 22 నవం 2026, 8:54 ఉద.
తాజా వార్తలు

అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. అరటికాయ ఫ్రై ఇలా చేయండి!

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 22 నవం 2026, 8:54 ఉద. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. అరటికాయ ఫ్రై ఇలా చేయండి!

Raw Banana Fry: భోజనంలో వేడి వేడి అన్నంతో పాటు కరకరలాడే అరటికాయ ఫ్రై ఉంటే ఆ రుచే వేరు! తక్కువ పదార్థాలతో, ఇంట్లోనే సులభంగా ఆంధ్రా స్టైల్‌లో అరటికాయ వేపుడు తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు

  • అరటికాయలు – 2
  • కారం – 1 టీస్పూన్
  • ధనియాల పొడి – ½ టీస్పూన్
  • బియ్యప్పిండి – 1 టేబుల్ స్పూన్
  • శనగపిండి – 1 టేబుల్ స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీస్పూన్
  • ఉప్పు – తగినంత
  • నువ్వుల నూనె లేదా సాధారణ నూనె – 3 టేబుల్ స్పూన్లు
  • కరివేపాకు – కొద్దిగా

తయారీ విధానం

  1. ముందుగా అరటికాయల తొక్కను తీసి గుండ్రంగా లేదా పలుచని ముక్కలుగా కోసుకోవాలి.
  2. కోసిన ముక్కలను నీళ్లలో వేసి పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల రంగు మారకుండా ఉంటుంది.
  3. ఒక గిన్నెలో కారం, ధనియాల పొడి, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలపాలి.
  4. అరటికాయ ముక్కల్లోని నీటిని పూర్తిగా తీసి ఈ మసాలా మిశ్రమం వేసి బాగా కలపాలి.
  5. పెనంపై నూనె వేసి వేడయ్యాక కరివేపాకు, అరటికాయ ముక్కలు వేయాలి.
  6. మీడియం మంటపై మూత పెట్టి 4–5 నిమిషాలు ఉడికించాలి.
  7. ఆ తర్వాత మూత తీసి ముక్కలను మధ్య మధ్యలో తిప్పుతూ కరకరలాడే వరకు వేయించాలి.
  8. చివరగా మంట తగ్గించి మరో రెండు నిమిషాలు వేయించి దించుకోవాలి.

Raw Banana Fry: కరకరలాడే అరటికాయ ఫ్రై కోసం చిట్కాలు

  • అరటికాయలను మరీ మందంగా కోయకూడదు.
  • బియ్యప్పిండి, శనగపిండి వేస్తే బయట క్రిస్పీగా వస్తాయి.
  • మొదట మూత పెట్టి ఉడికించి, తర్వాత మూత తీసి వేయించాలి.
  • ముక్కలను ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొద్దికొద్దిగా వేయించాలి.
#తాజావార్తలు
Raw Banana Fry: భోజనంలో వేడి వేడి అన్నంతో పాటు కరకరలాడే అరటికాయ ఫ్రై ఉంటే ఆ రుచే వేరు! తక్కువ పదార్థాలతో, ఇంట్లోనే సులభంగా ఆంధ్రా స్టైల్‌లో అరటికాయ…