షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 21 నవం 2026, 6:07 సా.
తెలంగాణ

శబరిమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 21 నవం 2026, 6:07 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
శబరిమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..

న్యూఢిల్లీ: శబరిమల వెళ్లే భక్తులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పవిత్ర ఇరుముడికెట్టును విమానాల్లో క్యాబిన్ బ్యాగేజీగా తీసుకెళ్లేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ అనుమతించింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి (బీసీఏఎస్) ఆదేశాలు జారీ చేసింది. వరుసగా మూడో ఏడాది ఈ వెసులుబాటును కల్పించారు.

పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు శనివారంనాడు సామాజిక మాధ్యం ఎక్స్‌లో చేసిన పోస్టులో.. శబరిమల భక్తులు ఇరుముడికెట్టును తీసుకెళ్లడం శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. దీనిలో లోతైన విశ్వాసం, భక్తి ఉన్నాయి. భక్తులు ఇరుముడికెట్టును విమాన క్యాబిన్‌లో తీసుకెళ్లేందుకు అనుమతిని వరుసగా మూడో ఏడాది కొనసాగిస్తున్నామని తెలియజేయడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. అయ్యప్ప భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా యాత్ర సాగించేలా బీసీఏఎస్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), విమానాశ్రయాల నిర్వాహకులు సహా సంబంధిత అధికారులందరికీ అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

#తెలంగాణ
న్యూఢిల్లీ: శబరిమల వెళ్లే భక్తులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పవిత్ర ఇరుముడికెట్టును విమానాల్లో క్యాబిన్ బ్యాగేజీగా తీసుకెళ్లేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ అనుమతించింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్…