షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 21 నవం 2026, 5:38 సా.
బిజినెస్

నా వల్లే బంగారం ధర తగ్గింది: పిఎం మోడీ

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 21 నవం 2026, 5:38 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
నా వల్లే బంగారం ధర తగ్గింది: పిఎం మోడీ

బంగారం కొనుగోళ్లను తగ్గించాలంటూ మే నెలలో తాను చేసిన విజ్ఞప్తికి దేశ ప్రజలు స్పందించారని, ఫలితంగా బంగారం ధరలు తగ్గాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన సూచన పాటించడం వల్ల తమ డబ్బు ఆదా అయిందని ప్రజలు ఇప్పుడు చెబుతున్నారని వెల్లడించారు. శనివారం లక్నోలోని గోమతీనగర్‌లో జరిగిన ఐదో జాతీయ నైపుణ్య స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఏడాది పాటు అత్యవసరమైతే తప్ప బంగారం కొనుగోలు చేయవద్దని మే నెలలో దేశ ప్రజలను కోరిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. 1965లో దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడినప్పుడు అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి ప్రజలు వారానికి ఒక పూట భోజనం మానుకోవాలని చేసిన విజ్ఞప్తితో మోదీ తన పిలుపును పోల్చారు.

బంగారం ధరలు, కొనుగోళ్లలో తగ్గుదల

మే 9న ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,250 ఉండగా, శనివారం నాటికి రూ.12,523కు తగ్గినట్లు గుడ్‌రిటర్న్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిచమురు ధరలు పెరిగి, దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఏర్పడిన నేపథ్యంలో మోదీ ఈ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ, బంగారం కొనుగోళ్లకు పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యం వినియోగమవుతోందని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని కోరారు. సెప్టెంబరులోనూ అత్యవసరమైతే తప్ప బంగారం కొనవద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు.

#బిజినెస్
బంగారం కొనుగోళ్లను తగ్గించాలంటూ మే నెలలో తాను చేసిన విజ్ఞప్తికి దేశ ప్రజలు స్పందించారని, ఫలితంగా బంగారం ధరలు తగ్గాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన సూచన పాటించడం…