షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 21 నవం 2026, 3:50 సా.
తాజా వార్తలు

నా లైఫ్‌లో ఉన్నది ఒక్కరే.. అది ఆంటోనీ మాత్రమే: కీర్తి సురేశ్‌

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 21 నవం 2026, 3:50 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
నా లైఫ్‌లో ఉన్నది ఒక్కరే.. అది ఆంటోనీ మాత్రమే: కీర్తి సురేశ్‌

Keerthy Suresh: గతంలో తనపై వచ్చిన ప్రేమ వదంతుల గురించి, తన భర్త ఆంటోనీ తటిల్ వ్యక్తిత్వం గురించి నటి కీర్తి సురేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సత్యవాన్ సావిత్రి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను వెల్లడించారు.

నటులతో లింకప్ రూమర్స్ బాధించాయి

సినీ పరిశ్రమలోని కొందరు నటులతో తనకు రిలేషన్‌షిప్ ఉందంటూ గతంలో ప్రచారమైన వార్తలు తనను ఎంతో బాధించాయని కీర్తి తెలిపారు. అయితే, తాను ఇప్పటివరకు కేవలం ఆంటోనీతో మాత్రమే బంధంలో ఉన్నానని తేల్చిచెప్పారు.

‘‘ఆ రూమర్స్ వచ్చినప్పుడు ‘నేనేమైనా స్పందించాలా?’ అని ఆంటోనీ అడిగేవాడు. అంతకుమించి నన్ను ఏనాడూ ప్రశ్నించలేదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య లేనప్పుడు, బయటి వారికి నేను ఏదో నిరూపించుకోవాల్సిన పనిలేదు. అందుకే వాటిని పట్టించుకోవడం మానేశాను’’ అని కీర్తి స్పష్టం చేశారు.

ఆయనకు లైమ్‌లైట్ ఇష్టం ఉండదు

ఆంటోనీకి సినిమా వేడుకలు, ప్రచార హడావుడి అస్సలు ఇష్టం ఉండవని కీర్తి పేర్కొన్నారు. అందుకే ఆయనను అసౌకర్యానికి గురిచేసే కార్యక్రమాలకు దూరంగా ఉంచుతానని చెప్పారు. తాను సినిమా ప్రీమియర్ షోలకు వెళ్లినా ఆయన రారని, తన పక్కన ఉండటం కంటే ఆయన సౌకర్యమే తనకు ముఖ్యమని అన్నారు.

నిరాశలో ఉన్నప్పుడు ధైర్యం ఇస్తారు

తన కెరీర్ ఎదుగుదలలో ఆంటోనీ పాత్ర ఎంతో ఉందని కీర్తి కొనియాడారు. తాను నిరాశకు లోనైనప్పుడల్లా ఆంటోనీ వెన్నుతట్టి ప్రోత్సహిస్తారని, ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని ప్రశంసించారు. దాదాపు 15 ఏళ్ల పాటు ప్రేమించుకున్న కీర్తి సురేశ్‌, ఆంటోనీ 2024లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

#తాజావార్తలు
Keerthy Suresh: గతంలో తనపై వచ్చిన ప్రేమ వదంతుల గురించి, తన భర్త ఆంటోనీ తటిల్ వ్యక్తిత్వం గురించి నటి కీర్తి సురేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సత్యవాన్ సావిత్రి’…