హైదరాబాద్, హయత్ నగర్‌లో 25 ఏళ్ల వివాహిత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. మొబైల్ ఫోన్ వాడుతున్నందుకు ఆమె తల్లి మందలించడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలానికి చెందిన లక్ష్మీదేవి హయత్ నగర్‌లో నివసిస్తోంది. ఫోన్ వాడవద్దని తల్లి చెప్పడంతో ఆమె మనస్తాపానికి గురైంది.
తన ఏడేళ్ల కుమార్తెను, మూడేళ్ల కుమారుడిని టెలివిజన్ ముందు కూర్చోబెట్టిన ఆమె, ఆ తర్వాత ఒక గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న హయత్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.