షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 21 నవం 2026, 3:25 సా.
ఆరోగ్యం

ఆరోగ్యశ్రీలో ఏడాదిగా జీతాల్లేవ్‌!

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 21 నవం 2026, 3:25 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
ఆరోగ్యశ్రీలో ఏడాదిగా జీతాల్లేవ్‌!
  • ఆందోళనలో డాటా ఎంట్రీ ఆపరేటర్లు కుటుంబ పోషణకు ర్యాపిడో బైక్‌ నడుపుకొనే దుస్థితి

హైదరాబాద్‌, నవంబర్‌ 21 (నమస్తే తెలంగాణ) : వైఎస్సార్‌ హ యాంలో ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ ప థకాన్ని రేవంత్‌ సర్కార్‌ నీరుగారుస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద పనిచేస్తున్న 800 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లకు దాదాపు ఏడాది నుంచి జీతాలు చెల్లించకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. కొన్ని జి ల్లాల్లో 11 నెలలుగా, పేట్లబురుజు లో ఆరు నెలలుగా, కోఠి ఈఎన్టీలో 4 నెలలుగా జీతాలు ఇవ్వక స్కూల్‌ ఫీజులు, ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.

గత్యంతరం లేక డ్యూటీ ముగిసిన తర్వాత ర్యాపిడో బైక్‌లు నడుపుకొని కుటుంబాలను పోషించుకునే దుస్థితి నెలకొన్నదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. జీతాలు సకాలంలో చెల్లించాలని ఆరోగ్యశాఖ మంత్రి, డీఎంఈ, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు వినతిపత్రాలు సమర్పించినా స్పంద న లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభు త్వం పెండింగ్‌ జీతాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

#ఆరోగ్యం
ఆందోళనలో డాటా ఎంట్రీ ఆపరేటర్లు కుటుంబ పోషణకు ర్యాపిడో బైక్‌ నడుపుకొనే దుస్థితి హైదరాబాద్‌, నవంబర్‌ 21 (నమస్తే తెలంగాణ) : వైఎస్సార్‌ హ యాంలో ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ ప…