షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 20 నవం 2026, 9:02 ఉద.
క్రైమ్ వార్తలు

ర్యాష్ డ్రైవింగ్ వద్దన్నందుకు కత్తులతో దాడి!

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 20 నవం 2026, 9:02 ఉద. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
ర్యాష్ డ్రైవింగ్ వద్దన్నందుకు కత్తులతో దాడి!

అమరావతి : కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం పాలెంలో దారుణం జరిగింది. గంగాధర్‌ను కొందరు యువకులు బైక్‌తో ఢీకొట్టారు. దీంతో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంపై గంగాధర్ వారిని ప్రశ్నించి మందలించాడు. ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని మందలించినందుకు ముగ్గురు యువకులు కత్తులతో దాడికి తెగబడ్డారు. దీనిని మనసులో పెట్టుకున్న యువకులు అదే రోజు రాత్రి కత్తులతో గంగాధర్ ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ క్రమంలో గంగాధర్‌పై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయగా, అన్నను కాపాడేందుకు ప్రయత్నించిన తమ్ముడు గణేష్‌పైనా దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో గంగాధర్ తీవ్రంగా గాయపడగా, గణేష్‌కు కూడా గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఇద్దరినీ కాకినాడకు తరలించారు. దాడికి పాల్పడిన నిందితులను శుక్రవారం ఉదయం గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తూ దాడికి పాల్పడిన వ్యక్తులపై దర్యాప్తు చేపట్టారు. ర్యాష్ డ్రైవింగ్‌పై మందలించినందుకే దాడి జరగడంతో గ్రామంలో ఈ ఘటన కలకలం రేపింది.

#క్రైమ్వార్తలు
అమరావతి : కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం పాలెంలో దారుణం జరిగింది. గంగాధర్‌ను కొందరు యువకులు బైక్‌తో ఢీకొట్టారు. దీంతో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంపై గంగాధర్ వారిని ప్రశ్నించి మందలించాడు.…