దోహ: ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో భాగంగా నేపాల్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత ఎ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్‌కు ఆరంభంలోనే నిరాశ ఎదురైంది. వన్డే టీమ్‌లో అవకాశం దక్కించుకున్న అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలు ఇరువురు ఆశించిన స్థాయిలో రాణించలేదు. అభిషేక్ 9 పరుగులు చేసి ఔట్ కాగా.. వైభవ్ 26 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక ఆయుష్ బదోని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. దీంతో 42 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో కుమార కుషాగ్రాతో కలిసి కెప్టెన్ తిలక్ వర్మ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. వీరిద్దరు కలిసి 87 పరుగుల భాగస్వామ్యంతో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. క్రీజ్‌లో కుషాగ్రా(48), తిలక్ (42) ఉన్నారు.