షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 19 నవం 2026, 1:20 సా.
తాజా వార్తలు

నదిలోకి దిగి క్లీన్ చేసిన సీఎం రేఖా గుప్తా

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 19 నవం 2026, 1:20 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
నదిలోకి దిగి క్లీన్ చేసిన సీఎం రేఖా గుప్తా

Delhi : దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది కాలుష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రక్షాళన చర్యలను వేగవంతం చేసింది. నదిలో పేరుకుపోతున్న చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రత్యేక శుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వయంగా రంగంలోకి దిగారు. షాలిమార్ బాగ్ ప్రాంతంలో నిర్వహించిన క్లీనింగ్ కార్యక్రమంలో సీఎం పాల్గొని నదిలోకి దిగి చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, గాయకుడు బిస్మాయిల్ తదితరులు కూడా పాల్గొని నది శుభ్రతకు తమ వంతు సహకారం అందించారు. ప్రముఖులు స్వయంగా శుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

పండుగలతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా బాధ్యతే!

ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. మన సంప్రదాయాలు, విశ్వాసాల ప్రకారం పండుగలను ఎంతో ఘనంగా జరుపుకోవడం ఎంత ముఖ్యమో, ఆ పండుగలు నిర్వహించే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. నదులు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయని, వాటిని కాలుష్యం నుంచి కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక వేడుకల సమయంలో నదుల్లో వ్యర్థాలు వేయకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. యమునా నది కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఇచ్చారు. నదుల పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, పౌరులందరూ పరిశుభ్రతను తమ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.

#తాజావార్తలు
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది కాలుష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రక్షాళన చర్యలను వేగవంతం చేసింది. నదిలో పేరుకుపోతున్న చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించి…