షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 18 నవం 2026, 12:02 సా.
ఆంధ్రప్రదేశ్

YS Jagan ED Chargesheet : జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో షాక్ .. కొత్త ఛార్జిషీట్‌ దాఖలు!

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 18 నవం 2026, 12:02 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
YS Jagan ED Chargesheet : జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో షాక్ .. కొత్త ఛార్జిషీట్‌ దాఖలు!
  • జగన్ అక్రమాస్తుల కేసులో మరో మలుపు..
  • దాల్మియా సిమెంట్స్‌ వ్యవహారంలో ఈడీ దూకుడు
  • 15 ఏళ్లుగా సాగుతున్న కేసు.. జగన్‌పై ఈడీ కొత్త ఛార్జిషీట్‌

YS Jagan ED Chargesheet : వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది.. దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) తాజాగా మరో కీలక అడుగు వేసింది.దాల్మియా సిమెంట్స్‌ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో పదో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

ఈ ఛార్జిషీట్‌లో జగన్‌తో పాటు దాల్మియా సిమెంట్స్‌కు చెందిన పునీత్‌ దాల్మియా తదితరుల పేర్లను చేర్చింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (PMLA) ఉల్లంఘనకు పాల్పడ్డారన్నది ఈడీ ప్రధాన ఆరోపణ..

దాల్మియా సిమెంట్స్‌ కేసు ఏంటి? :
కడప జిల్లాలోని 417 హెక్టార్ల సున్నపురాయి గనులను అప్పటి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్‌కు లీజుకు ఇచ్చింది. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని సీబీఐ ఆరోపించింది. జగన్‌కు చెందిన సంస్థలకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్‌ లబ్ధి పొందిందని పేర్కొంటూ 2013లో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

ఈ వ్యవహారంలో జగన్‌కు సుమారు రూ.150 కోట్ల మేర అక్రమ ప్రయోజనం చేకూరినట్లు సీబీఐ తన ఛార్జిషీట్‌లో ఆరోపించింది. రఘురామ్‌ సిమెంట్స్‌లో రూ.95 కోట్ల విలువైన షేర్లు, మరో రూ.55 కోట్లు హవాలా మార్గంలో అందించారని పేర్కొంది..

ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ :
సీబీఐ కేసు ఆధారంగా మనీలాండరింగ్‌ కోణంలో రంగంలోకి దిగిన ఈడీ.. గతంలోనే దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. ఈ అంశంపై గతంలో దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను కొన్ని సాంకేతిక కారణాలతో కోర్టు వెనక్కి పంపింది..

దీంతో గతంలో జరిగిన లోపాలను సరిచేసి, అదనపు ఆధారాలు, అవసరమైన అనుమతులతో ఈడీ తాజాగా మరోసారి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇప్పటికే తొమ్మిది ఛార్జిషీట్లు దాఖలు చేసిన ఈడీ.. ఇప్పుడు పదో ఛార్జిషీట్‌ను కూడా కోర్టు ముందుంచింది. 15 ఏళ్లుగా సాగుతున్న జగన్‌ అక్రమాస్తుల కేసులో తాజా ఛార్జిషీట్‌ను కోర్టు పరిశీలించనుంది.

#ఆంధ్రప్రదేశ్
జగన్ అక్రమాస్తుల కేసులో మరో మలుపు.. దాల్మియా సిమెంట్స్‌ వ్యవహారంలో ఈడీ దూకుడు 15 ఏళ్లుగా సాగుతున్న కేసు.. జగన్‌పై ఈడీ కొత్త ఛార్జిషీట్‌ YS Jagan ED Chargesheet…