షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 18 నవం 2026, 3:39 సా.
వినోదం

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ అప్పుడేనా?

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 18 నవం 2026, 3:39 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
మహేష్ బాబు నెక్స్ట్ మూవీ అప్పుడేనా?

Mahesh New Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ విడుదలైన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘వారణాసి’ సినిమా విడుదలయ్యే వరకు మహేష్ బాబు తన ప్రస్తుత లుక్‌ను కొనసాగించాలని మేకర్స్ సూచించినట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్లలోనూ ఇదే లుక్‌తో పాల్గొనాల్సి ఉండటంతో మరో సినిమా కోసం కొత్త లుక్‌లోకి మారేందుకు అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో ‘వారణాసి’ విడుదలయ్యే వరకు మహేష్ తన తదుపరి సినిమా షూటింగ్‌కు దూరంగా ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనగా, ఈ సినిమా ప్రమోషన్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

సందీప్ వంగా లేదా బుచ్చిబాబు.. మహేష్‌ను డైరెక్ట్ చేసేదెవరు?

‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమా దర్శకుడిపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా లేదా ఉప్పెన, పెద్ది చిత్రాల దర్శకుడు బుచ్చిబాబు సానా మహేష్‌తో సినిమా చేసే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరితో మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఖరారు చేస్తారనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో సినిమా చేయాలని దర్శకులు ఆసక్తి చూపుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. ‘వారణాసి’ విడుదల తర్వాత మహేష్ తన కొత్త సినిమా పనులను ఎప్పుడు ప్రారంభిస్తారు? దర్శకుడిగా ఎవరిని ఎంపిక చేసుకుంటారు? అనే అంశాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ సినీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారాలుగానే ఉన్నాయి.

#వినోదం
Mahesh New Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ విడుదలైన…