షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 18 నవం 2026, 3:09 సా.
బీమా

Indiramma Family Life Insurance : రేషన్ కార్డు లేకున్నా రూ.5 లక్షల బీమా.. ఎవరు అర్హులు? ఇందిరమ్మ పథకానికి ఎలా అప్లయ్ చేయాలంటే?

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 18 నవం 2026, 3:09 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
Indiramma Family Life Insurance : రేషన్ కార్డు లేకున్నా రూ.5 లక్షల బీమా.. ఎవరు అర్హులు? ఇందిరమ్మ పథకానికి ఎలా అప్లయ్ చేయాలంటే?
  • రాష్ట్రంలో కోటికిపైగా ఫ్యామిలీలకు రూ.5 లక్షల బీమా
  • రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అప్లయ్ చేసుకోవచ్చు
  • ఎవరు అర్హులు? అర్హతలు, దరఖాస్తు విధానం ఎలాగంటే?

Indiramma Family Life Insurance Scheme : మీకు రేషన్ కార్డు ఉందా? లేకున్నా డోంట్ వర్రీ.. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆర్థికంగా ఆ కుటుంబం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తీసుకొస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించనుంది. అయితే, ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? రేషన్ కార్డు తప్పనిసరా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎవరు అర్హులు? :
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న సంపాదించే వ్యక్తులు అర్హులు. ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీ ఆధారంగా వయసును లెక్కిస్తారు. ముఖ్యంగా ఒక కుటుంబంలో ఎంతమంది సంపాదిస్తున్నా ఒక్కరికి మాత్రమే బీమా సౌకర్యం ఉంటుంది. కుటుంబ సభ్యులే ఎవరికి బీమా చేయించుకోవాలనేది నిర్ణయించుకోవచ్చు. బీమా పొందిన వ్యక్తి అనుకోకుండా మరణిస్తే నామినీకి రూ.5 లక్షల పరిహారం అందుతుంది..

రేషన్ కార్డు లేకున్నా దరఖాస్తు చేయొచ్చా? :
ఈ పథకంలో రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అలాంటి వారు ప్రత్యేక దరఖాస్తు ఫారం, ప్రత్యేక కోడ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇతర జిల్లాల్లో రేషన్ కార్డు ఉన్నవారు కూడా తమకు దగ్గర్లోని రిజిస్టర్ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే రేషన్ కార్డు లేదని అర్హులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..

ఎలా అప్లయ్ చేసుకోవాలి? :
గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వం ప్రత్యేక నమోదు శిబిరాలను ఏర్పాటు చేయనుంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు అధికారులు నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. దరఖాస్తు సమయంలో బీమా పొందే వ్యక్తి ఆధార్ వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, నామినీ వివరాలు అందించాలి.

నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.. దరఖాస్తు చేసే సమయంలో నామినీ వివరాలు, ఒకరి కన్నా ఎక్కువ మంది నామినీలు ఉంటే పరిహారం పంపిణీ విధానం గురించి కూడా ముందుగానే తెలుసుకోవడం బెటర్..

#బీమా #తెలంగాణ
రాష్ట్రంలో కోటికిపైగా ఫ్యామిలీలకు రూ.5 లక్షల బీమా రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అప్లయ్ చేసుకోవచ్చు ఎవరు అర్హులు? అర్హతలు, దరఖాస్తు విధానం ఎలాగంటే? Indiramma Family Life Insurance…