రోడ్డు పక్కన ఎండిపోయిన చెట్టు కూలి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన బుధవారం నాగోల్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. తట్టి అన్నారం ఇందు అరణ్య సమీపంలోని వెంకటేశ్వర కాలనికి చెందిన సాయికుమార్ బుధవారం సాయంత్రం గ్యాస్ బుకింగ్ కోసం బైక్ పై గౌరెల్లి వైపు వెళ్తుండగా కుంట్లూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిపోయిన భారీ చెట్టు విరిగి పడింది. ఈ ప్రమాదంలో సాయి కుమార్ తీవ్రంగా గాయపడి సంఘటనాస్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.