షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 18 నవం 2026, 12:47 సా.
బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ వరల్డ్ రికార్డ్..

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 18 నవం 2026, 12:47 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ వరల్డ్ రికార్డ్..

జోహన్నెస్‌బర్గ్: బంగ్లాదేశ్ కీపర్-బ్యాటర్ లిట్టన్ దాస్ న్యూ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఎనిమిది మందిని అవుట్ చేసిన తొలి ఆటగాడిగా లిట్టన్ దాస్ రికార్డుల పుస్తకాల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో దాస్ ఈ మైలురాయిని సాధించాడు. గతంలో ఐదుగురు వికెట్ కీపర్లు.. వసీం బారి, బాబ్ టేలర్, ఇయాన్ స్మిత్, రిడ్లీ జాకబ్స్, జోషువా డా సిల్వా సంయుక్తంగా నెలకొల్పిన రికార్డును లిట్టన్ దాస్ బ్రేక్ చేశాడు.

నాలుగో రోజు తొలి సెషన్‌లో కగిసో రబాడాను స్టంప్ చేయడంతో దాస్ ఈ ఘనతను సాధించాడు. మరోవైపు, బ్యాటింగ్ లోనూ దాస్(120) అద్భుత సెంచరీతో రాణించాడు. దీంతో ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీతో పాటు ఎనిమిది మంది ప్లేయర్లను ఔట్ చేసిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు.

ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 557 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 157 పరుగులు వెనబడిన బంగ్లాను ఇంగ్లాండ్ జట్టు ఫాలో ఆన్ ఆడించింది. ఈ క్రమంలో నాలుగో రోజు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా రెండు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది.

#బంగ్లాదేశ్
జోహన్నెస్‌బర్గ్: బంగ్లాదేశ్ కీపర్-బ్యాటర్ లిట్టన్ దాస్ న్యూ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఎనిమిది మందిని అవుట్ చేసిన తొలి ఆటగాడిగా లిట్టన్ దాస్…