షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 17 నవం 2026, 7:30 సా.
బీమా

Revanth Reddy | ప్రతి కుటుంబానికీ రూ. 5 లక్షల బీమా.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 17 నవం 2026, 7:30 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
Revanth Reddy | ప్రతి కుటుంబానికీ రూ. 5 లక్షల బీమా.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Revanth Reddy | హైదరాబాద్‌, నవంబర్‌ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేలా, ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం అందించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌ నివాసంలో జరిగిన సమీక్షలో సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీధర్‌, కార్యదర్శి మాణిక్‌రాజ్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా తదితరులతో సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు. ఈ నెల 19న సిద్దిపేట బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తును విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఇందిరమ్మ బీమా ద్వారా కుటుంబ పెద్ద లేదా బీమా పరిధిలోకి వచ్చే వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఆర్థిక భరోసాగా అందుతుందని తెలిపారు. సిద్దిపేట సభలోనే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు.

#బీమా #తెలంగాణ
Revanth Reddy | హైదరాబాద్‌, నవంబర్‌ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేలా, ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం అందించేలా…